హైదరాబాద్‌ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి : వైవీ సుబ్బారెడ్డి

Feb 14,2024 08:47 #press meet, #yv subbareddy

విశాఖ : హైదరాబాద్‌ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచన అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన.. రాజధాని కట్టే అవకాశం ఉన్నా.. ఐదేళ్లు తాత్కాలిక పేరుతో టీడీపీ కాలయాపన చేసింది.. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖ రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు. విశాఖ రాజధాని కార్య సాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని ఉండాలనేది ఆలోచన.. విభజన చట్టం ప్రకారం మరికొంత కాలం హైదరాబాద్‌ ఉమ్మడిగా వుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు.ఇక, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యత అవసరం అన్నారు . ఈనెలాఖరు లోపు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఒకటి రెండు జోడించి మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడించారు.. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయ్యిందని.. ఒకటి, రెండు స్థానాల్లో మార్పులు వుండే అవకాశం ఉంది.. తప్పితే పెద్దగా మార్పులు ఉండబోవు అన్నారు.. ఈ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తాం అన్నారు. మరోవైపు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ముగ్గురు రాజ్యసభ సభ్యులు గెలవడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా అని వ్యాఖ్యానించారు.

➡️