తెలంగాణ : ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ కేసులో ఏ2గా అర్వింద్ కుమార్ ఉన్నారు. ఈరోజు అర్వింద్ కుమార్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. అర్వింద్ కుమార్ తన పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవో (ఫార్ములా-ఈ ఆపరేషన్స్)కు హెచ్‌ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు సమాచారం. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అర్వింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నేడు రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉండగా … మరోవైపు పార్ములా-ఈ రేసు కేసులో బీఎల్‌ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. రేసు జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు. రూ.45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/e-race-telangana.jpg)