వచ్చే ఏడాది నుండి ఐబీ విధానం వస్తుంది : గవర్నర్‌

అమరావతి : ఎపి విద్యా విధానంలో వచ్చే ఏడాది నుండి ఐబీ విధానం అమల్లోకి వస్తుందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రకటించారు. ఎపి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ … మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన అందిస్తున్నామని అన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామన్నారు. అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చునని చెప్పారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కఅషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నామన్నారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్‌ తెలిపారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదని చెప్పారు.

  • ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంవైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. వైఎస్సార్‌ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నామన్నారు. ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నామని తెలిపారు. 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ చేశామన్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ చేశామని చెప్పారు. మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి కేంద్రీకరించామని గవర్నర్‌ తెలిపారు. ఏపీలో 55, 607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం ఇచ్చామన్నారు. 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు అందించామన్నారు. ఆక్వా రైతుల విద్యుత్‌ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించామని తెలిపారు. రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించామన్నారు. చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చామన్నారు. రైతులు రాష్ట్రానికి వెన్నుమక62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని అన్నారు. 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేశామని గవర్నర్‌ చెప్పారు. ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామన్నారు. రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. మిచాంగ్‌ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం అందించామన్నారు. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివఅద్ధి చేశామన్నారు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించామని గవర్నర్‌ తెలిపారు. ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతోందని గవర్నర్‌ ప్రశంసించారు.
➡️