ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైల్వేలో ప్రయాణించేందుకు టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ టికెట్‌తోపాటు ప్రయాణికునికి సంబంధించిన ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తప్పనిసరని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టిటిఇ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లుగానే పరిగణించి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించకుండా అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన 12 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకటి రైలులో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు.