అమరావతి : వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. సెకీ ఒప్పందం గురించి టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నాయని అమర్నాథ్ మండిపడ్డారు. ‘విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరింది. కేబినెట్ లో చర్చిన తరువాత సైకీతో ఒప్పందం ప్రభుత్వం చేసుకుంది. సైకీ తో ఒప్పందం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ అధ్యయనం చేసిన 45 రోజులు తరువాత ఒప్పదం చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థ సైకీని దళారి సంస్థ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎలా రాస్తాయి అని ప్రశ్నించారు? విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు 5 రూపాయలకు యూనిట్ విద్యుత్ కొంటే.. జగన్ 2.49 పైసలకు కొన్నారని, వైఎస్ జగన్ ను అదానీ కలిస్తే తప్పు. అదే చంద్రబాబుని కలిస్తే గొప్పగా చెబుతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సెకీ తో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకు ఒప్పదం చేసుకున్నది మన రాష్ట్రమే. జగన్ చేసుకున్న ఒప్పందం తప్పితే ఆ ఒప్పందం తప్పని రద్దు చేయొచ్చుగా. రూ.2.49 కంటే తక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవచ్చుగా.. 86 వేల కోట్లు బారం వేసిన చంద్రబాబు గొప్పనా. రాష్ట్రానికి లక్ష పది వేల కోట్లు మిగిల్చిన వైఎస్ జగన్ గొప్పనా? ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు 20 వేల కోట్లు బారం ప్రజలపై వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ను చంద్రబాబు నిలబెట్టుకోవాలి లేకపోతే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.