- తెలంగాణ ఎంఎల్‌ఎల పార్టీ ఫిరాయింపు అంశంపై సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయించిన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్న పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేస్తుంటే, రాజ్యాంగ పరిరక్షకురాలిగా దేశ అత్యున్నత న్యాయస్థానం చేతులు ముడుచుకుని కూర్చోదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం) బృహత్తర లక్ష్యాన్ని ఓడించేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలాన్ని గడపలేరని జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. నిర్దిష్టమైన పద్దతిలో నిర్ణయించాల్సిందిగా స్పీకర్‌కు న్యాయస్థానాలు చెప్పలేవు, కానీ నిర్దిష్టమైన, సహేతుకమైన కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేవా అని జస్టిస్ గవారు ప్రశ్నించారు. కె.టి.రామారావు, పాడి కౌశిక్ రెడ్డి సహా భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ గవారు నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. తెలంగాణాలో పాలక కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10మంది ఎంఎల్‌ఎలపై అనర్హతా చర్యలు పెండింగ్‌లో వున్నాయి. వాటిపై సకాలంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరు పిటిషన్లు వేశారు.
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ కింద దాఖలైన అనర్హతా పిటిషన్లపై నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్లను రాజ్యాంగ న్యాయస్థానాలు ఆదేశించవచ్చా లేదా అనేది ఈ కేసులో ప్రధాన ప్రశ్నగా వుంది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఈ స్పీకర్లు క్వాసీ జ్యుడీషియల్ ట్రిబ్యునళ్ళుగా వ్యవహరిస్తారు. ”ఇక్కడ మీ వాదన ఎలా వుందంటే, స్పీకర్ చర్య తీసుకోకపోతే, రాజ్యాంగ పరిరక్షకురాలిగా కూడా వుండే సుప్రీం కోర్టు చేష్టలుడిగి కూర్చోవాలా? ఐదేళ్ల సభా కాల పరిమితిలో మొదటి ఏడాదిలోనే ఫిరాయింపు జరిగితే, మిగిలిన నాలుగేళ్లు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, కోర్టు చేతులు కట్టేసుకుని కూర్యోవాల్సిందేనా, ఏం చేయలేవా? ” అని జస్టిస్ గవారు ప్రశ్నించారు.
ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఇసి తదితరులు వున్నారు. వీరివైపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోV్‌ాతగి. సీనియర్ న్యాయవాది ఎ.ఎం. సింఘ్వి, న్యాయవాది శ్రవర్ కుమార్ ప్రభృతులు వాదిస్తున్నారు. రాజ్యాంగ కోర్టులు అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను అభ్యర్ధించవచ్చు కానీ నాలుగు వారాలు, ఆరు వారాలంటూ గడువు విధించి దానికి కట్టుబడాల్సిందిగా ఆదేశించలేవని రోV్‌ాతగి వాదించారు. స్పీకర్‌పై సూపరింటెండెంట్ అధికారాలు కోర్టులకు లేవన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ కూడా ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నందున కోర్టుల జ్యుడీషియల్ సమీక్ష అధికారం స్పీకర్ తుది నిర్ణయానికే పరిమితమై వుంటుంది. అంతేకానీ స్పీకర్‌కు గడువు విధించలేరని అన్నారు. జాప్యం వద్దంటూ కోర్టు నుండి స్పీకర్‌కు వెళ్ళే సందేశం అభ్యర్ధన పదజాలంగానే వుంటుంది కానీ వాస్తవానికి అభ్యర్ధన కాదని జస్టిస్ గవారు అన్నారు. సుప్రీం కోర్టు అభ్యర్ధించినప్పటికీ స్పీకర్ ఉల్లంఘిస్తే రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద అసాధారణ అధికారాలను కోర్టు ఉపయోగించుకోవచ్చు. ఏ రాజ్యాంగ సంస్థ అయినా సుప్రీం కోర్టు అభ్యర్ధన లేదా ఆదేశాలకు కట్టుబడక పోయినట్లైతే మేం చేతులు ముడుచుకుని కూర్చోబోం” అని జస్టిస్ గవారు చెప్పారు. కోర్టులకు ఇలా చేయండి, అలా చేయండని ఎవరైనా చెప్పగలరా అని రోV్‌ాతగి ప్రశ్నించారు. ఆరు లేదా ఎనిమిది వారాల్లో అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగ సంస్థ ఎలా అదేశించగలదు? అని ఆయన ప్రశ్నించారు. దానికి బదులుగా సహేతుకమైన కాల వ్యవధిలో స్పీకర్ నిర్ణయించాలని మాత్రం కోర్టులు చెప్పగలవని అన్నారు. గతేడాది మార్చి-ఏప్రిల్‌లో అనర్హతా పిటిషన్లు దాఖలైతే ఈ ఏడాది జనవరిలో మాత్రమే నోటీసులు జారీ చేశామని గవారు చెప్పారు.