శ్రీకాకుళం : గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. సోమవారం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ … గత ప్రభుత్వంలో నదుల అనుసంధానం సహా కనీసం రోడ్లు వేయలేక పోయారని విమర్శించారు. మాజీ మంత్రి సీదిరి వైసిపి కార్యాలయాల గురించి మాటాడుతున్నారని.. అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని అన్నారు. జగన్ చేసింది అరాచకం, దోపిడీ అని అన్నారు. మంచి చేస్తే ఓటేయండి అన్నారు కానీ.. మంచి చేయలేదు కాబట్టే ప్రజలు తిరస్కరించారని అన్నారు. కనీసం పది కిలోమీటర్ల రోడ్డు కూడా వేయలేకపోయారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇదొక గుణపాఠం అని అన్నారు. ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని ధ్వజమెత్తారు. జగన్‌మోహన్ రెడ్డి దోపిడీపై విచారణ చేపట్టాలని చంద్రబాబుతోపాటు కూటమి నేతలను కోరారు. లూటి చేయడానికే ఉత్తరాంధ్ర రాజధాని అన్నారని అన్నారు. విశాఖ రుషికొండ ప్యాలెస్ లో ఒక్క బెడ్ రూం ఇరవై సెంట్లలో కట్టారని చెప్పారు. ప్రజల చీత్కారాన్ని జగన్ గుర్తించాలన్నారు. ఓటమిని కూడా అంగీకరించడం లేదన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చో పెట్టే సాంప్రదాయం కూడా పాటించలేదని చెప్పారు. జగన్ ఐదు లక్షల రూపాయల కోట్లు దోపిడీ చేశారని అన్నారు. పంచాయితీలలో నిధులు డైవర్ట్ చేశారని చెప్పారు. పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ద్వివేది మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన అధికారులపై శాఖా పరమైన విచారణ చేయాలని కూన రవికుమార్ డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయింది : ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
