చంద్రగిరిలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు

  • గ్రామాల్లో విస్తతంగా ఫ్లాగ్‌ మార్చ్‌

ప్రజాశక్తి రామచంద్రపురం ( చంద్రగిరి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక దాడులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా ఎస్‌పివి విష్ణువర్ధన్‌ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి పోలీసులు అలర్ట్‌ అయ్యారు. గురువారం మండలంలోని శేషాపురం, భీమవరం నారావారిపల్లి చిన్న రామాపురం గ్రామాలలో సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఎం.రామయ్య ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్‌ మార్చును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రామయ్య మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాలలో శాంతి భద్రతలకు ఆటకం కల్పిస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రగిరి మండలంలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని ఆయన తెలిపారు. పోలింగ్‌ అనంతరం రామిరెడ్డిపల్లి, కూచి వారి పల్లి గ్రామాలలో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన కేసులో నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమంలో ఎస్‌ఐ అనిత, సిఐఎస్‌ఎఫ్‌ బలగాలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️