ప్రజాశక్తి – తిరుపతి సిటీ : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 24 వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్‌పి సుబ్బారాయుడు తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు తిరుమలకు జగన్
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సిఎం జగన్ శుక్రవారం సాయంత్రం తిరుమల పర్యటనకు రానున్నారు. శనివారం శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరుమల ప్రక్షాళన పేరుతో శుక్రవారం బిసివై వ్యవస్థాపకులు రామచంద్రయాదవ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పుంగనూరులో ప్రారంభమైన పాదయాత్ర 30న ఉదయం 9.15 గంటలకు అలిపిరి వద్దకు చేరుకుంటుంది.