జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు.. వివరణ ఇవ్వాలని డిమాండ్‌ : ఏపిడబ్ల్యూజేఎఫ్‌

May 14,2024 15:42 #APWF, #prakatana

తిరుపతి: తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌ రెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండిస్తోంది.ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షులు ఎస్‌ వెంకట్రావు , ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.” తిరుపతిలోని జర్నలిస్టులు ఉమామహేశ్వరరావు, నరేంద్రల పేర్లు ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఆరోపణలు ఎంత మాత్రం సమంజసమైనవి కావని ఫెడరేషన్‌ భావిస్తోంది. మీడియాలో వచ్చిన వార్తల్లో తప్పులుంటే, పొరపాట్లు ఉంటే వాటిపై వివరణ ఇవ్వాలి. అవి తీవ్రమైనవని భావిస్తే కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది.అందుకు భిన్నంగా ఏమాత్రం సంబంధం లేని విధంగా ఆరోపణలు చేయడం వారిని కబ్జాదారులు అని వ్యాఖ్యానించడం ఎంత మాత్రం సరికాదని ఫెడరేషన్‌ భావిస్తోంది. రాజకీయ నాయకులుగా విజ్ఞతతో వ్యవహరించాల్సిన వారు భిన్నంగా వ్యవహరించడం సరికాదని అటువంటి వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేస్తోంది.” అని ప్రకటనలో తెలిపారు.

➡️