- విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఎపిడబ్ల్యుజెఎఫ్ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివిధ చానెళ్లు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) తీవ్రంగా ఖండించాయి. ఒక రాజకీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యులుగా వుంటూ, వ్యక్తిగత ధూషణలకు పాల్పడటం, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, అవమానించేలా మాట్లాడటం తగదని, తక్షణం విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు, ఎపిబిజెఎ రాష్ట్ర కన్వీనర్లు వి శ్రీనివాసరావు, కె మునిరాజ్ గురువారం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశాయి. మహిళలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను ప్రస్తావించే సమయంలో మీడియా సంయమనంతో వృత్తి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.