తిరుపతికి ఆగని బాంబు బెదిరింపులు

ప్రజాశక్తి-తిరుమల : తిరుపతిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం నుంచి మొదలైన బాంబు బెదిరింపులు.. ఇప్పటికీ ఆగలేదు. ఆదివారం కూడా మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. జాఫర్‌ సాధిక్‌ పేరుతో హోటళ్లతో పాటు ఆలయానికి కూడా బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటళ్లు, ఆలయంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

➡️