- జిఒఎంఎస్ నెంబరు 18 విడుదల
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కోస్తా జిల్లాల్లో పనిచేస్తున్న హ్యామ్ రేడియో ఆపరేటర్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మంగళవారం జిఒఎంఎస్ నెంబరు 18ని విడుదల చేసింది. ఇప్పటి వరకు నెలకు రూ.15 వేలు ఉండగా, ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రూ.18,450లకి వారి గౌరవ వేతనం పెరిగింది. కోస్టల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని తొమ్మిది మంది ఆపరేటర్లకు ఈ గౌరవ వేతనం పెంపు వర్తించనుంది.