బీహార్ : బీహార్‌లోని రూపాలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి జెడియుకి చెందిన కళాధర్ మండల్‌పై 8211 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ 67779 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా, జెడియుకి చెందిన కళాధర్ మండల్ 59568 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆర్‌జెడికి చెందిన బీమా భారతి మొత్తం 30108 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
