Indrasena Reddy – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

తెలంగాణ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి ఇందిరా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇంద్రసేనారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్‌ నేతలు సంతాపం తెలిపారు.

➡️