ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు.. నేడు హైకోర్టులో విచారణ

Nov 29,2023 10:50 #Nara Chandrababu
high court

అమరావతి : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. అలాగే, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ, ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపైనా నేడు విచారణ జరగనుంది. మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించింది. బాబుకు బెయిలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసినా చుక్కెదురైంది. బెయిలు రద్దు పిటిషన్‌ను డిసెంబరు 8కి వాయిదా వేసిన ధర్మాసనం.. హైకోర్టు షరతుల్లో కొన్నింటిని మార్పు చేసింది. చంద్రబాబు బహిరంగ సమావేశాలకు హాజరు కావొచ్చిన స్పష్టం చేసింది. అయితే, కేసు గురించి మాత్రం ఎక్కడా మాట్లాడవద్దని ఆదేశించింది.

➡️