వసతి గృహంలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Feb 11,2024 11:32 #suside, #Telangana

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇమాంపేట బాలిక గురుకుల వసతి గృహంలో ఇంటర్‌ విద్యార్థిని వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు సూర్యాపేట పట్టణంలో ఎన్టీఆర్‌ నగర్‌ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. నిన్న కళాశాలలో ఫెయిర్‌వెల్‌ పార్టీకి వెళ్లొచ్చిన వైష్ణవి పార్టీకి ముందు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తమ కూతురుని ఎవరో హత్య చేశారని వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యపై సమగ్ర విచారణ జరిపి దొషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

➡️