హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మఅతిచెందిన విషాద ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు తనను హాస్టల్ వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి శుక్రవారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగల్ గిరీష్ కుమార్‌కు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మఅతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
