తిరుపతి: తిరుపతి జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రౌడీషీటర్ వినరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనతో బాధిత విద్యార్థిని అవమాన భారంతో కుంగిపోయింది. ఈ క్రమంలో తలకు రాసే నూనె తాగింది. గమనించి కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
