ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 13,2024 22:45 #inter student, #Suicide

ప్రజాశక్తి-మాచర్ల రూరల్‌ (పల్నాడు జిల్లా) :ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంభంపాడు గ్రామానికి చెందిన ఈర్ల మహేందర్‌ (17) నర్సరావుపేటలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్‌ మెదటి సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో మహేందర్‌ ఫెయిల్‌ అవడంతో అందరితోనూ ముభావంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పొలం పనుల నుండి వచ్చిన తల్లిదండ్రులు మహేందర్‌ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

➡️