కానూరు (కృష్ణా) : ఫ్యాన్‌కు ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో జరిగింది. కానూరులోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుర్రం.వేణునాథ్ (18) తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వేణునాథ్ స్వస్థలం తోట్లవల్లూరు మండలం గురువిందపల్లిగా తెలుసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
