నువ్వులకు అంతర్జాతీయ గుర్తింపు అభినందనీయం

Jun 8,2024 21:18 #collecter, #ongle
  • కలెక్టర్‌ ఎఎస్‌.దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : అంతర్జాతీయ స్థాయిలో 140 దేశాలలో నువ్వుల పంటను అమ్ముకోవటానికి ఇండి గ్యాస్‌ ధ్రువీకరణ అవసరమని, పాలంబడి – మేలైన వ్యవసాయ సాగు పద్ధతులతో పండించిన విధానం అభినందనీయమని కలెక్టర్‌ ఎఎస్‌.దినేష్‌కుమార్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురంలోని 15 మంది రైతులకు సంబంధించిన 150 కింటాళ్ల నువ్వులను బెంగళూరు యురేకా ఎనలిటికల్‌ సర్వీసెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరీక్షించి మంచి ఉత్పత్తులుగా నిర్ధారించింది. గ్లోబల్‌ మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ (ఎపిఎస్‌ఒపిసిఎ) ఆమోదించి స్కోప్‌ సర్టిఫికెట్‌ అందజేంది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2023-24 రబీ పంట కాలంలో 14 వారాలపాటు ఆ గ్రామంలో ఎంపిక చేసిన రైతుల పంట పొలాల్లో విత్తనం నుండి విక్రయం వరకు మేలైన సాగు పద్ధతులు పాటించి ఉత్పత్తులకు విలువ జోడించారన్నారు. రైతులకు సాగు ఖర్చులు రూ.12,000 కాగా, సరాసరి దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్లు వచ్చిందని, ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే, గరిష్ట ధర ఈ ఉత్పత్తులకు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.60 వేలు రైతులు ఆదాయం పొందారన్నారు. రైతులకు కలెక్టర్‌ స్కోప్‌ సర్టిఫికేట్‌ అందించారు. స్టార్టప్‌ షాపుల వారికి ఉత్పత్తులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి సాగు డిపిఎం సుభాషిణి, తాళ్ళూరు మండల ఎఒ బి.శ్రీనివాసరావు, శశికళ, శ్రీనివాస్‌ నాయక్‌, విఎఎ రాజశేఖరరెడ్డి, రైతులు, శివపార్వతి, అనిత పాల్గొన్నారు.

➡️