స్విమ్స్‌లో ఇంటర్వ్యూలు వాయిదా

Mar 13,2025 23:49 #Doctors

 ‘మత ప్రాతిపదికన’ వద్దని విద్యార్థి సంఘాల వినతి
ప్రజాశక్తి – తిరుపతి సిటీ : స్విమ్స్‌ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఒత్తిడి మేరకు ఈ నెల 14న జరగాల్సిన ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్‌వి కుమార్‌ తెలిపారు. మార్చి 8న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 34 పోస్టులకు కేవలం హిందువులు మాత్రమే అర్హులని పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు స్విమ్స్‌ డైరెక్టర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్య, వైద్య సంస్థలు రాజ్యాంగబద్దంగా నడుస్తాయని, లౌకిక సంస్థల్లో ఇలాంటి మత ప్రాతిపదికన నియామకాల నోటిఫికేషన్‌ ఇవ్వడం టిటిడి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తెలిపారు. మత వివక్ష వీడి, రాజ్యాంగ బద్దంగా అర్హులందరికీ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. విసితో చర్చలు జరిపి ఇంట ర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డైరెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రవి, చలపతి, ఉదరుకుమార్‌, ప్రవీణ ్‌కుమార్‌, భార్గవ్‌, బాలాజీ, చెన్నకేశవులు పాల్గొన్నారు.

➡️