విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ

Nov 29,2023 16:16 #AP High Court

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలోని రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ పిల్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఇవాళ్టి విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. రుషికొండ పరిస్థితులపై డిసెంబరు మొదటి వారంలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పంపే బృందం పరిశీలన చేపడుతుందని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. ఆ బృందం రుషికొండ పరిస్థితులపై నివేదిక రూపొందించి సమర్పిస్తుందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను డిసెంబరు 27వ తేదీకి వాయిదా వేసింది.

➡️