ఐటిఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

May 14,2024 21:42 #admissions, #iti, #open

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటిఐలలో వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడ్‌లలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి, శిక్షణ సంస్థ డైరెక్టరు బి నవ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రిషేన్‌ కోసం ఐటిఐ.ఎపి.జివొవి.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆఖరు తేదీ జూన్‌ 10గా నిర్ధారించామని, ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా సరిచేసుకుని నింపాలన్నారు. ఇతర వివరాల కోసం దగ్గర్లోని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు.

➡️