నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌కు రిమాండ్‌

హైదరాబాద్‌ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నిఖేష్‌ను జడ్జి నివాసంలో హాజరు పరిచారు. ఈనెల 13వ తేదీ వరకు ఏసీబీ జడ్జి రిమాండ్‌ విధించారు. దీంతో నిఖేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. నిఖేష్‌ ఇంటితో పాటు బంధువుల నివాసాలలో 25 నుంచి 30 చోట్ల సోదాలు జరిపిన అధికారులు.. దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

➡️