ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకుగానూ ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)కి ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎస్‌ఒ) సర్టిఫికెట్‌ వరించింది. హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మంగళవారం తాడేపల్లిలోని ఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో నైపుణ్యాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ సురేష్‌ కుమార్‌, ఎమ్‌డి వినోద్‌ కుమార్‌కు ఐఎస్‌ఒ 2001-2015 సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్‌ఒ సర్టిఫికెట్‌ రావటం చాలా ఆనందంగా ఉందని, ఈ సర్టిఫికెట్‌ ద్వారా ఎపిఎస్‌ఎస్‌డిసి మరో మైలురాయిని అధిగమించిందని చెప్పారు.

➡️