50 రోజుల్లో టిడిఆర్‌ బాండ్ల జారీ

Mar 14,2025 20:20 #TDR bonds

ఆన్‌లైన్లోనే దరఖాస్తు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి జారీచేసే ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌(టిడిఆర్‌) బాండ్లను వీలైనంత త్వరగా జారీచేయాలని పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. బాండ్లకు సంబంధించిన దరఖాస్తులను నేరుగా తీసుకోవద్దని, ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఇవ్వాలనీ పేర్కొన్నారు. బాండ్ల జారీకి సంబంధించి నూతన విధివిధానాలకు సంబంధించిన ప్రక్రియపై ఆదేశాలు జారీచేశారు. దరఖాస్తు వెరిఫికేషన్‌కు 15 రోజులు, అభ్యంతరాలు, ఇతరాలను 15 రోజుల్లో పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. బాండ్ల జారీకి సంబంధించి నాలుగు రోజుల్లో పేపరు ప్రకటన ఇవ్వాలని, ఏడు రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. ఏడురోజుల పరిశీలన అనంతరం మరో ఆరు రోజుల్లోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం వారం రోజుల్లో టిడిఆర్‌ బాండు జారీచేయాలని మొత్తం 50 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు ఈ నిబంధనలు పాటించాలని అందులో సూచించారు.

➡️