ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది పచ్చ పత్రమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాల్లేకుండా రాజకీయ కోణంలో అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఎన్నో నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. రోడ్లు, భవన నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లామని అన్నారు. రాజధానిలో అన్ని తరగతులవారు ఉండాలని తమ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టిడిపి నాయకులు అడ్డుకోలేదా? అని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
