సిఎంపై దాడిని అవహేళన చేయడం తగదు : మంత్రి జోగి రమేష్‌

Apr 19,2024 00:54 #coments, #Minister Jogi Ramesh, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా అవహేళన చేయడం తగదని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్‌పై విజయవాడలో దాడి జరిగితే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌ ఆ దాడిని డ్రామా అని, పథకం ప్రకారం చేశారని సంస్కార హీనంగా మాట్లాడు తున్నారని అన్నారు. సిఎం జగన్‌పై చంద్రబాబు దుష్ప్రచారం తగదని వైసిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకరరావు అన్నారు. చుండూరు, పదిరికుప్పం ఘటనలు చంద్రబాబు కుట్రలేనని విమర్శించారు.

చంద్రబాబు, పవన్‌పై ఇసికి ఫిర్యాదు
ఈ నెల 17న పెడన, మచిలీపట్నంలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు, ధూషణలు చంద్రబాబు చేశా రని సిఇఒ ఎంకె మీనాకు వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు మనోహర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నారు. ఈ నెల 16న నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో టిడిపి నేత చింతకాయల అయన్నపాత్రుడు కూడా జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారని ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️