అది అటవీ భూమి కాదు : సజ్జల సోదరులు పిటిషన్‌

ప్రజాశక్తి-అమరావతి : కడప జిల్లా, సికెదిన్నె మండలం, గ్రామ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 184.32 ఎకరాల భూమి విషయంలో అధికారులు చట్ట వ్యతిరేకంగా జోక్యం చేసుకుంటున్నారంటూ వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ భూములతో సజ్జలకు గానీ, ఆయన కుటుంబ సభ్యులుకు గానీ సంబంధం లేదన్నారు. ఈ మేరకు సజ్జల దివాకర్‌రెడ్డి కొడుకు సజ్జల సందీప్‌ రెడ్డి, భార్య భగీరథి, మరో సోదరుడు జనార్ధన్‌రెడ్డి ఆయన భార్య విజయకుమారి, దివాకర్‌ రెడ్డి అల్లుడు సత్య సందీప్‌ రెడ్డి పిటిషన్లు వేశారు. దీనిని జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ శుక్రవారం విచారించారు. వాదనల తర్వాత హైకోర్టు.. ఆ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశించింది.

➡️