ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణాజలాల అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ విభజన చట్టంలో కృష్ణాజలాల పంపకంపై స్పష్టమైన నిర్ణయం ఉన్నప్పటికీ 2023 సంవత్సరంలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ రెండూ కలిపి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా జలాల వివాదాన్ని ముందుకు తీసుకొచ్చాయని తెలిపారు.
ట్రిబ్యునల్ ముందుకు వచ్చిన కృష్ణాజలాల వివాద అంశంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వం తన వాదన వినిపించాలని వి కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
