- జగన్‌పై ఆనం వెంకటరమణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పరువునష్టం దావా వేస్తాననడం హాస్యాస్పద మని టిడిపి నేత, ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. పరువుంటే ఎఫ్‌బిఐపై కేసు వేయగలరా? అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. జగన్ విద్యుత్ రంగాన్ని తన లంచాల దాహంతో ఐదేళ్లపాటు సర్వనాశనం చేశారన్నారు. సోలార్ విద్యుత్ ధరలు రోజురోజుకూ దిగజారిపోతుంటే తను మాత్రం యూనిట్ ధర రూ.2.49లకు ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. సెకీ ఇతర రాష్ట్రాలకు లేఖ రాయకుండా రాష్ట్ర ప్రభుత్వానికే ఎందుకు రాసిందో చెప్పగలవా? అని ప్రశ్నించారు. సెకీతో ఒప్పందం చేసుకుని ఉంటే ఎఫ్‌బిఐ తన పేరును ఛార్జిషీట్‌లో ఎందుకు దాఖలు చేశారని నిలదీశారు. పరువునష్టం దావా వేయడాన్ని తాము స్వాగతిస్తున్నా మని, అలా అయితే తన నిజ స్వరూపమే బయటపడుతుందని పేర్కొన్నారు.