పార్టీ నుంచి తొలగించడం దురదృష్టకరం : మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

ప్రజాశక్తి-అమరావతి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ మోసం చేసిందంటూ సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు. వైసీపీని మోసం చేయలేదని.. ఎలాంటి నోటీస్‌.. వివరణ తీసుకోకుండా సస్పెండ్‌ చేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడే నన్ను అవమానించారని తెలిపారు. కదిరి నియోజకవర్గంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. అందరితో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు.

➡️