హైదరాబాద్‌ పాతబస్తీలో ఐటీ సోదాలు

Feb 13,2024 10:33 #hyderabad, #it

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని పాతబస్తీలో మరోసారి ఐటీ సోదాల కలకలం రేగింది. కింగ్స్‌ ప్యాలెస్‌ యజమాని షానవాజ్‌ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షానవాజ్‌ దుబారులో ఉన్న సమయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తాజాగా నేడు తెల్లవారుజామున నుంచే ఈ సోదాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రెండు సార్లు షానవాజ్‌పై ఐటీ దాడులు జరిగాయి.

➡️