జగన్‌ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి

May 14,2024 22:35 #ap cm jagan, #cbi court

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడి వివరాలు కోర్టుకు, సిబిఐకి సమర్పించాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న వైఎస్‌ జగన్‌… ఈ నెల 16 నుంచి జూన్‌ ఒకటి వరకు లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు అనుమతించాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సిబిఐ కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పై మేరకు ఆదేశాలు జారీ చేసింది.

➡️