ప్రజాశక్తి-గుంటూరు : మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడి చేశారన్న కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. గుంటూరు జైల్లో ఉన్న సురేశ్‌ను.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. సురేశ్ కు దైర్యం చెప్పి.. పార్టీ అన్నీవిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ రాకతో గుంటూరు జిల్లా జైలు వద్దకు వైసీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. దీంతో జైలు అధికారులు, పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
