నియంత్రించే బాధ్యత జగన్‌కు లేదా? : మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ హయాంలో టిటిడిలో జరిగిన అపచారాలను ఆ సమయంలో నియంత్రించే బాధ్యత ఆయనకు లేదా? అని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ చేసిన తప్పుల నుంచి దృష్టి మళ్ళించడానికి బిజెపి నేతల పాత్ర ఉందని, బోర్డులో బిజెపి వాళ్లు ఉన్నారంటూ నిందను తమకు ఆపాదించాలని చూస్తున్నారని ఆరోపించారు. లడ్డూలో కల్తీ నెయ్యి సంఘటనలో తప్పు చేసిన వారందరికీ శిక్షలు తప్పవన్నారు.

➡️