పులివెందులకు చేరుకున్న జగన్‌

May 12,2024 20:52 #ap cm jagan, #pulivendula, #today

– రేపు ఓటు వేయనున్న ముఖ్యమంత్రి
ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌.భారతి ఆదివారం సాయంత్రం పులివెందుల చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భాకరాపురంలోని జయమ్మ కాలనీలోని 138వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో జగన్‌మోహన్‌రెడ్డితోపాటు భారతి, కడప ఎంపి వైఎస్‌.అవినాష్‌రెడ్డి ఓటు వేయనున్నారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయ పంచాయతీ పరిధిలోని మల్లెలమ్మపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన బూతు నెంబర్‌ 261లో ఆమెతోపాటు భర్త అనిల్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

➡️