ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై జగన్ మాట్లాడటం సిగ్గుచేటని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎపిని అప్పగిస్తే వ్యక్తిగత స్వార్థంతో నాశనం చేసింది నిజం కాదా? అని జగన్‌ను ప్రశ్నించారు. అసమర్ధ పాలన, అస్మదీయులకు దోచిపెట్టింది వాస్తవం కాదా? అని పేర్కొన్నారు. 2022-23, 2023-24 ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రజలపై మోపాలని డిస్కమ్‌లకు అనుమతినిచ్చింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. జగన్ తప్పిదాలతో అనవసరంగా హిందూజా పవర్‌కు రూ.1,200 కోట్లు చెల్లించారని విమర్శించారు.