ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సెకీ, ఎపి ప్రభుత్వానికి మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తప్పుడు కథనాలు ప్రచురించాయంటూ రెండు మీడియా సంస్థలకు మాజీ సిఎం వైఎస్ జగన్ లీగల్ నోటీసు జారీ చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్న జగన్, దాన్ని మొదటిపేజీలో ప్రచురించాలని కోరారు. ఎపి ప్రభుత్వం, సెకీ మధ్య ఒప్పందమంతా పారదర్శకంగా జరిగిందన్న వివరాలు, ఆధారాలను లీగల్ నోటీసులో జత చేసిన ఆయన ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రచురించారని పేర్కొన్నారు. దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతిందన్నారు.