ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన టిడిపి నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. హత్యా రాజకీయాలు ఇకనైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
