అదానీతో సంబంధం లేదని జగన్‌ చెప్పడం హాస్యాస్పదం

  • బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అదానీతో విద్యుత్‌ ఒప్పందం కుదిరిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి… అదానీతో తనకు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శనివారం సంఘటనా పర్వ రాష్ట్ర స్థాయి వర్కుషాప్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అదానీతో ఒప్పందాలు చేసుకున్న సమయంలో ప్రస్తుతం పాలకపక్షంలో ఉన్న ప్రభుత్వాలు ఆనాడు విపక్షంలో ఉన్నాయన్నారు. విద్యుత్‌ ఒప్పందాలకు, బిజెపికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఈ వర్కుషాప్‌కు బిజెపి జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె లక్ష్మణ్‌, జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర రిటర్నింగ్‌ అధికారి వెంకట సత్యనారాయణ హాజరయ్యారు.

➡️