రామోజీరావు మరణంపై జగన్‌ ట్వీట్‌..

Jun 8,2024 10:52 #jagan, #tweets

అమరావతి: మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్‌ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జగన్‌ ట్వీట్‌ చేశారు.

➡️