దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా..?.. లడ్డూ వివాదంపై జగన్‌ ట్వీట్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సత్యమేవ జయతే అంటూ వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ట్వీట్‌ చేశారు. లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఇఒ, సిఎం చంద్రబాబుపై ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ వీడియోలు పోస్టు చేశారు. దీని అర్థం ఏమిటి చంద్రబాబు.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా..? అంటూ వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. సెప్టెంబరు 18న సిఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందంటూ ఒకసారి, యాత్రికులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్‌ కాకుండా యానిమల్‌ ఫ్యాట్‌ కూడా వాడారని, తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు మళ్లీ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. టిటిడి ఇఒ శ్యామలరావు.. ఆ ట్యాంకర్లను వాడలేదని, వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్య ప్రచారానికి దిగారని జగన్‌ తెలిపారు.

➡️