మానవత్వంపై జగన్‌ మాటలు హాస్యాస్పదం : కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌

ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) : మానవత్వం గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎంపిని పోలీసులతో కొట్టించినప్పుడు మానవత్వం ఏమైందని ప్రశ్నించారు. బిజెపితో అంటకాగిన జగన్‌.. అధికారం కోల్పోయ్యాక సెక్యులరిజం, దళితులు గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వైద్యం అందించలేదని ఆరోపించారు. టిటిడి అన్న ప్రసాదాలకు అవసరమైన నెయ్యిని తిరుపతి పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగులుగా ఉన్న వారికి ఆవులను సబ్సిడీ ద్వారా ఇప్పించి అవసరమైన నెయ్యిని స్థానికంగానే సమకూర్చుకునేలా టిటిడి ఇఒ, అధికారులు ఆలోచన చేయాలని సూచించారు. టిటిడి బోర్డు ద్వారా తీసుకున్న నిర్ణయాలను మాత్రమే ఉద్యోగులు అమలు చేస్తుంటారని, అలాంటి వారిని నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకోమన్నారు.

➡️