రామోజీరావు మృతికి జన విజ్ఞాన వేదిక సంతాపం

ప్రజాశక్తి-విజయవాడ : రామోజీరావు మృతికి జన విజ్ఞాన వేదిక(జెవివి) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు జెవివి రాష్ట్ర అధ్యక్షులు గేయా నంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షరతా ఉద్యమంలో, మద్య వ్యతిరేక ఉద్యమంలో ఆయన జన విజ్ఞాన వేదికకు తోడ్పాటును అందించిన విషయాలను తాము గౌరవంతో గుర్తు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ విజయనగరంలో జరిగినప్పుడు, ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగం చేశారని మననం చేసుకున్నారు. తెలుగువారి సామాజిక, రాజకీయ రంగాలను, అన్ని విధాలుగా అయన ప్రభావితం చేశారని కొనియాడారు. రామోజీరావు స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.

➡️