ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్‌ ఆసక్తి : ఇండియా టుడే ఛానల్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్‌ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోడి, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్‌ రిపోర్టర్‌ పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు. రిపోర్టర్‌ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినప్పటికీ.. పవన్‌ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్‌ మాట్లాడుతూ … పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్‌ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని ప్రసారంలో పేర్కొన్నారు.

➡️