అవాకులు, చవాకులు పేలితే సహించం : జనసేన

Apr 21,2024 21:06 #JanaSena, #pavan kalyan

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే సీటు దక్కలేదన్న అక్కసుతో వైసిపిలో చేరిన పోతిన మహేష్‌ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఇకపై సహించేది లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తే పెద్ద నాయకులు అయిపోరని, పోతిన మహేష్‌కు పార్టీలో ఎంతో ప్రాధాన్యమున్న పదవులు ఇచ్చారని అన్నారు.
పాణ్యం నియోజకవర్గంలో జనసేన కార్యకర్త షేక్‌ సలామ్‌.. వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ప్రశ్నించినందుకు అతనిపై దాడి చేశారని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

➡️