మార్చి 12,13,14 తేదీల్లో జనసేన ప్లీనరీ : నాదెండ్ల మనోహర్‌

35-thousand-crores-corruption-in-Jagananna-colonies-Nadendla-Manohar

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి నెల 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ నిర్ణయించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ప్లీనరీ సన్నాహకాలపై మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కోర్‌ కమిటీ సమావేశం శుక్రవారం మనోహర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 12న ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం డెలిగేట్స్‌తో సమావేశం ఉంటుందని, 14న బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ప్లీనరీలో వివిధ అంశాలపై చర్చాగోష్టులు ప్రజోపయోగంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఎంపి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, లోకం మాధవి, అరవ శ్రీధర్‌, బొల్లిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️